calender_icon.png 3 October, 2025 | 1:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా ప్రారంభమైన అలయ్ బలయ్

03-10-2025 11:35:38 AM

హైదరాబాద్: మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ(Bandaru Dattatraya) ఆధ్యర్యంలో నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో అలయ్ బలయ్ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ప్రతి ఏటా దత్తాత్రేయ దసరా మర్నాడు ఆలయ్ బలయ్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అలయ్ బలయ్ కార్యక్రమానికి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, మంత్రులు, వివిధ పార్టీల నేతలు  హాజరుకానున్నారు. తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలు, ఆహార అలవాట్లు చాటిచెప్పేలా అలయ్ బలయ్ కార్యక్రమం కొనసాగనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసినట్లు బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి పేర్కొన్నారు. ఉద్యమ సమయంలో రాజకీయ నాయకుల మధ్య ఐక్యత కోసం దత్తన్న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.