03-10-2025 11:02:45 AM
వెంపటిలో కొండ పుల్లమ్మ వెంకన్న ఇంటి మట్టి గోడ కూలి దీనస్థితిలో.
తుంగతుర్తి, (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం లోని వెంపటి గ్రామానికి చెందిన కొండ వెంకన్న పుల్లమ్మ అనే వృద్ద దంపతులు నివాసం ఉంటున్న ఇల్లు గోడ గురువారం ఉదయం సుమారు 4 గంటల సమయంలో కూలిపోయింది. ప్రమాదవశాత్తు ఇల్లు గోడ రోడ్డు వైపు పడింది.కానీ గోడ లోపలి వైపు కూలితే, అవృద్ధ దంపతులు చనిపోయివుండె వారు, గతంలో కురిసిన భారీ వర్షాలు,నిన్న కురిసిన వర్షము తో గొడలన్ని తడిసి నాని, ఈ ప్రమాదం జరిగింది. ఆ ఇల్లంతా పూర్తి స్థాయి లో శిదిలా వ్యవస్థ కు చేరుకుంది.ప్రభుత్వం చొరవ తీసుకొని ఆ వృద్ధ దంపతులను ఆదుకోవాలి.వెంటనే స్థానిక ప్రభుత్వ అధికారులు, జిల్లా కలెక్టర్ స్పందించి, ఇందిరమ్మ ఇల్లు వచ్చే విధంగా, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని వృద్ధ దంపతులు, స్థానికులు కోరుతున్నారు