calender_icon.png 2 October, 2025 | 4:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొంబ్బరి బొండాల మాటున గంజాయి తరలింపు

02-10-2025 02:30:04 AM

  1. పెద్ద అంబర్‌పేట్ వద్ద పట్టుబడిన ముఠా
  2. విశాఖపట్నం నుంచి రాజస్థాన్‌కు తరలింపు

అబ్దుల్లాపూర్‌మెట్, అక్టోబర్ 1: కొంబరి బొండ మాటున గంజాయి తరలిస్తున్న ముఠా పట్టుబడిన సంఘటన అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈగల్ టీమ్ తెలిపిన వివరాల ప్రకారం..  రాజస్థాన్ రాష్ట్రం, చిత్తోర్ఘర్‌కు చెందిన అరెస్టు చేసిన చోటు నారాయణ లాల్ నాయక్ (34) ఇదే రాష్ట్రానికి చెందిన పుష్కర్ నాయక్ (24) ఆర్టీఏ ఏజెంట్, కిషన్ లాల్ నాయక్ (35)లు గంజాయి తరలిస్తుంటారు.

ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం నుంచి రాజస్థాన్‌కు గంజాయి తరలిస్తున్న పక్కా సమాచారంతో ఖమ్మం ఈగల్ టీమ్, రాచకొండ ఈగల్ టీమ్‌ల ఆధ్వర్యంలో సోమ వారం రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధి వాహనాలను తనిఖీలు నిర్వహిస్తుండా డీసీఎం ఐషర్ ఆర్‌జే 09జీఈ 1754 నెంబర్‌గల వాహనంలో కొంబరి బొండాల లోటు ఉండడంతో అనుమానం వచ్చి పూర్తి స్థాయి పరిశీలించగా అందులో 401 కిలోల రూ.2కోట్లు విలువచేసే గంజాయి పట్టుకున్నారు.

నిందితులను అరెస్టు చేసి విచారించగా.. ఆంధ్రప్రదేశ్ రాజమండ్రికి చెందిన శ్రీధర్ వద్ద కొనుగోలు చేసి.. తన హ్యుందాయ్ వెన్యూలో వాహనాన్ని ఎస్కాడ్ ఉపయోగిస్తారు. దీనికి గాను చోట నారాయణ లాల్ నాయక్‌ను నియమించుకుని.. అతని రూ.25,000 ఇస్తు వచ్చాడు. ఇదే అదునుగా బావించి చోట నారాయణ లాల్ నాయక్ శ్రీధర్ వద్ద కిలో గంజాయి రూ.2వేల కొనుగోలు చేసి రాజస్థాన్‌లోని ఆషు బికనీర్‌కు రూ.4వేలకు బేరం కుదిరించుకుని ఒప్పందం చేసుకున్నాడని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ నుంచి రాజస్థాన్‌కు గంజాయి చేరవేడానికి పుష్కర్ రాజ్ నాయక్, కిషన్ లాల్ నాయక్, పరమేశ్వర్లను ఐషర్ వాహనంలో కొంబరి బొండాలను లోడ్ మధ్యలో గంజాయి పెట్టుకుని రాజస్థాన్‌కు తరలిస్తుండగా రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో పట్టుబడ్డారు.

పట్టుబడిన నిందితులను చోటు నారాయణ లాల్ నాయక్, పుష్కర్ నాయక్, కిషన్ లాల్ నాయక్‌లను రిమాండ్ పంపినట్లు తెలిపారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు శ్రీధర్, రమేశ్, ఇన్‌స్పెక్టర్లు విజయ్‌కుమార్, ప్రవీణ్‌కుమార్, సబ్ ఇన్‌స్పెక్టర్లు రవికుమార్, జీవన్‌రెడ్డిలున్నారు.