calender_icon.png 3 October, 2025 | 2:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామారెడ్డిలో గ్రూపుల మధ్య ఘర్షణ

03-10-2025 12:16:35 PM

  1. కత్తిపోట్ల కలకలం 
  2. దాండియా ఆటలో వీరంగం సృష్టించిన యువకులు 
  3. కత్తులతో దాడి చేస్తున్న యువకులు 
  4. ఐదుగురికి గాయాలు, చికిత్స నిమిత్తo ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు 
  5. పోలీసుల అప్రమత్త తో తగ్గిన ఘర్షణ వాతావరణం 

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి(Kamareddy) పట్టణ నడి బొడ్డులో పాత బస్టాండ్ సమీపంలో నెలకొల్పిన దుర్గ మాతను కొంతమంది యువకులు కలిసి ప్రతిష్టించారు. గురువారం రాత్రి దుర్గామాతను ఉద్వాసన పలికిన అనంతరం సుభాష్ రోడ్లు దాండియా నృత్యం చేస్తుండగా గురువారం అర్ధరాత్రి ఇరు వర్గాల కు చెందిన యువకుల మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో కొంతమంది యువకులు పథకం ప్రకారం చాకులు ధరించి వచ్చి దాండియా  ఆడుతున్న క్రమంలో యువకులు ఘర్షణ పడ్డారు.  ఇరు వర్గాల యువకులు ఘర్షణ పడగ చాకులు కలిగిన  యువకులు దాడికి పాల్పడడంతో ఐదుగురు యువకులకు గాయాలయ్యాయి. తప్ప తాగిన యువకులు ఘర్షణ పడ్డట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఉద్రిక్తత తగ్గించారు. కామారెడ్డి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కామారెడ్డి పట్టణంలో యువకుల మధ్య తలెత్తిన వివాదం కత్తిపోట్లకు దారితీసినట్లు తెలుస్తోంది.