7 May, 2026 | 9:26 AM

రెండు కార్లు ఢీ

24-06-2024 12:10 AM

ఏడుగురికి తీవ్రగాయాలు

యాదాద్రి భువనగిరి, జూన్ 23 (విజయక్రాంతి): హైదరాబాద్ జాతీయ రహదారిపై యాదాద్రి భువనగిరి జిల్లా రాయిగిరి వద్ద ఆదివారం రెండు కార్లు ఢీకొన్న ప్రమాదంలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి.. ఆలేరుకు చెందిన వెంకటేశ్ తన కుటుంబ సభ్యులు నాగ లక్ష్మి, లీలావతి, ధనుష్, వంశీతేజ, అనుష్క్‌తో కలిసి కారులో హైదరాబాద్‌కు వెళ్తున్నాడు. వరంగల్ చెంది న మారుతి తన కారులో హైదరాబాద్‌కు వెళ్తూ రాయిగిరి వద్ద ఓవర్‌టేక్ చేయబోయి వెంకటేశ్ కారును ఢీకొట్టాడు. దీంతో రెండు కార్లలో ప్రయా ణిస్తున్న ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు 108 అంబు లెన్సుకు సమాచారం ఇవ్వగా క్షతగాత్రులను చికిత్స నిమిత్తం భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. ఈ మేరకు భువనగిరి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.