ఔటర్‌పై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా
ఒకరి మృతి, పలువురికి తీవ్రగాయాలు
రంగారెడ్డి, జూన్ 23 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా నార్సింగ్ మున్సిపాలిటీ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డుపై ఆదివారం రాత్రి ప్రైవే ట్ ట్రావెల్స్ బస్సు బోల్తాపడిన ఘ టనలో ఒకరు మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. బాధి తులు, పోలీసుల కథనం ప్రకారం.. మార్నింగ్ స్టార్ ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు హైదరాబాద్ నుంచి ముంబాయికి వెళ్తుండగా నార్సింగ్ సమీపంలో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమా దంలో పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డా రు. గాయపడిన వారిలో ఒకరు మర ణించారు. పలువురు వాహనదారులు క్షతగ్రాతులను చికిత్స నిమి త్తం దవాఖానకు తరలించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని బస్సును క్రేన్ సాయంతో పక్కకు తొలగించారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని డ్రైంక్ అండ్ డ్రైవ్ టె స్టు నిర్వహించగా మద్యం తా గినట్లు గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలు పూర్తిగా తెలియాల్సి ఉంది.






