కుక్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం
24-06-2024 12:10 AM
జగదేవ్‌పూర్, జూన్ 23 : జగదేవ్‌పూర్ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల బాలికల వసతి గృహంలో రెండు అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఇన్‌చార్జి ఉమామహేశ్వరీ ఆదివారం తెలిపారు. ఎంపికైన వారికి ప్రతినెలా రూ.6500 వేతనం ఉంటుందని తెలిపారు. 7వ తరగతి ఉత్తీర్ణులై, 18-45 సంవత్సరాల మధ్య వయ స్సు గల వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. జగదేవ్‌పూర్‌కు చెందిన వారు మాత్రమే అర్హులని, ఆసక్తిగల వారు ఈనెల 29లోపు బాలికల వసతిగృహంలో దరఖాస్తు చేసుకో వాలని కోరారు.






