7 July, 2026 | 6:25 PM

Breaking News

"సర్" ప్రక్రియను ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలి   •   బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నాయకత్వానికి ఏడాది.. రామాలయంలో ప్రత్యేక పూజలు   •   ఆదివాసి నాయకపోడ్ కులస్తులకు దాతలకు హృదయపూర్వక ధన్యవాదాలు   •   ప్రభుత్వ ఉచిత విద్యను, సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలు చేరాలి   •   విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన పెద్దకాపర్తి సర్పంచ్   •   గౌలిగూడ కు వెళ్లాలా... అయితే ముక్కు మూయాల్సిందే...!   •   మృతుల కుటుంబాలకు పరామర్శ, ఆర్థిక సాయం   •   డబుల్ మర్డర్ కేసులో సంచలన తీర్పు   •   విడతల వారీగా యూరియా ఇవ్వడం సరికాదు   •   మున్సిపాలిటీలో పారిశుద్ధ్య పనులు   •  

ఒకే గ్రామంలో ఇద్దరు ఉరి వేసుకుని ఆత్మహత్య.!

27-07-2024 01:27 PM

వివాహేతర సంబంధమే కారణమంటూ పోలీసుల అనుమానం

తెలకపల్లి మండలం గౌరారంలో ఘటన

నాగర్ కర్నూల్, విజయక్రాంతి: ఒకే గ్రామంలో ఇద్దరు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం గౌరారం గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. ఎస్సై నరేష్ తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన మేడం పరశురాం(38) అనే వ్యక్తి గ్రామంలో కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనంతరం శనివారం తెల్లవారుజామున అదే గ్రామానికి చెందిన దండు అమృతమ్మ(40) అనే ఒంటరి మహిళ తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.

వెంటనే నాగర్ కర్నూల్ జిల్లా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పరశురాం మృతి చెందిన విషయం తెలిసే అమృతమ్మ ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్తులు తెలిపారు. వీరి ఇరువురి మధ్య వివాహేతర సంబంధమే ఈ మరణాలకు కారణం అయి ఉంటుందన్న అనుమానంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. మృతుడు పరుశురాంకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతురాలికి గత 15 ఏళ్ల క్రితమే భర్తను, రెండేళ్ల క్రితం కుమారుడిని కోల్పోయింది. గత కొంతకాలంగా కడుపునొప్పుతోను బాధపడుతున్నట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. ఈ రెండు మరణాలపై కేసులు నమోదు చేసుకొని దర్యాప్తు జరుగుతున్నట్లు ఎస్సై నరేష్ తెలిపారు.