15 April, 2026 | 7:26 AM

పురపోరుకు రెండు కోఆర్డినేషన్లు

08-02-2026 12:17 AM

ప్రకటించిన పీసీసీ అధ్యక్షుడు  

హైదరాబాద్, ఫిబ్రవరి 7 (విజయక్రాంతి): పురపోరు నేపథ్యంలో కాంగ్రెస్ పా ర్టీ రెండు కమిటీలను నియమించింది. ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షినటరాజన్ ఆదేశాల మేరకు పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్  మీడియా కో ఆర్డినేషన్, మానిటరింగ్ కమిటీలను ప్రకటించారు. మీడియా కమిటీ చైర్మన్‌గా సామా రామ్మోహన్‌రెడ్డి, సభ్యులు గా లింగంయాదవ్, రవిచంద్ర, రమ్యారావు, ఇందిరా శోభన్, జక్కాని అనిత,  హైమావతి, పి.పద్మ, జగదీష్ నేత, ఎండీ గౌస్, కల్పనారెడ్డి, మంజులారెడ్డి, అహ్మద్‌నజీర్, నరేందర్, నరేష్ రాథోడ్ ఉన్నారు.మున్సిపల్ మానిటరిగ్ కమిటీకి చైర్మన్‌గా మాజీ ఎమ్మెల్యే మృత్యంజయ్, కన్వీర్స్‌గా సునితా, శివచంద్రారెడ్డి, వెంకటస్వామి, సభ్యులుగా సదా ల క్ష్మి, ఇందిరారావు, ప్రియాంక, భాస్కర్, శత్రురావు, రాణి, వరలక్ష్మి, ఇప్రాన్ అలీ, పతికు మార్, కోట్యా నాయక్‌ను నియమించారు.