3 March, 2026 | 12:35 PM

రోడ్డు భద్రత నియమాలు ప్రతి ఒక్కరు పాటించాలి

13-11-2025 08:22 AM

హుజూర్ నగర్ ఎస్ఐ బండి మోహన్

హుజూర్ నగర్: వాహనదారులు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా రోడ్డు భద్రత నియమాలను పాటించి ప్రమాదాలను నివారించాలని హుజూర్ నగర్ ఎస్ఐ బండి మోహన్ బాబు అన్నారు. బుధవారం మండల పరిధిలోని గోపాలపురం గ్రామంలోని కోదాడ నుండి జడ్చర్ల రహదారి ఎన్ హెచ్- 165, బూరుగడ్డ వెళ్లే క్రాసింగ్ వద్ద  నూతనంగా ఏర్పాటు చేసిన బారికేడ్లను ప్రారంభించి  మాట్లాడారు... వేగ నియంత్రణ బోర్డులు ఏర్పాటు చేయడం వల్ల వాహనాలు వేగం తగ్గి వెళ్లడంతో పాదాచారులకు ఇబ్బందులు కలవకుండా ఉంటాయన్నారు.  వాహనదారులు అతివేగంతో ప్రయాణించకుండా వెళ్లడంతో రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు.ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ బాలరాంరెడ్డి,సిబ్బంది,తదితరులు, పాల్గొన్నారు.