28 June, 2026 | 3:11 PM

Breaking News

రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •  

విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన కారు.. ఇద్దరు ఐటీ ఉద్యోగులు మృతి

07-06-2025 08:30 AM

హైదరాబాద్: మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని(Ghatkesar Police Station) ఏదులాబాద్ వద్ద శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా దూసుకొచ్చి అదుపుతప్పిన కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు ఐటీ ఉద్యోగులు(IT employees) మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి గాయాలు కావడంతో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. మృతులను కుంట్లూరుకు చెందిన భార్గవ్, సైనిక్ పురికి చెందిన వర్షిత్ గా గుర్తించారు. మాధారంలో(Madharam) విందుకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని బాధితులు తెలిపారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.