నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలు మేలు
29-06-2026 12:00 AM
నేతివానిపల్లి సర్పంచ్ పద్మ వెంకటేష్ నాయక్
మల్దకల్, జూన్ 28: జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం నేతివానిపల్లి గ్రామంలో పోలియో చుక్కల కార్యక్రమాన్ని సర్పంచ్ పద్మ వెంకటేష్ నాయక్ ప్రారంభించారు. అనంతరం చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించడం ద్వారా పోలియో వ్యాధిని శాశ్వతంగా నివారించవచ్చని తెలిపారు. చిన్నారుల్లో అంగవైకల్యాన్ని నివారించి, ఆరోగ్యవంతమైన భవిష్యత్తుకు బాటలు వేయాలని పిలుపునిచ్చారు. ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ తిరిగి పోలియో చుక్కలు వేయిస్తారని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.






