12-11-2025 12:54:54 AM
ధర్మపురి, నవంబర్ 11(విజయక్రాంతి): ఎండపల్లి మండల కేంద్రంగా కొనసాగుతున్న ఇసుక దందాపై “కలెక్టర్ సారూ... ఇటు చూడరూ”అనే శీర్షికతో విజయక్రాంతిలో కథనం ప్రచురితం అయిన విషయం పాఠకులకు విధితమే. దీనిపై స్పందించిన ఎండపల్లి తహసీల్దార్ స్వయంగా రంగంలోకి దిగి అక్రమంగా రవాణా చేస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను పట్టుకుని సీజ్ చేశారు. చట్టానికి ఎవరు అతీతులు కారనీ, చట్టాన్ని ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడితే ఎంతటివారినైన ఉపేక్షించేది లేదనీ, కఠిన శిక్షలు అమలయ్యేలా చర్యలు తీసుకుంటామనీ అక్రమార్కులకు తహసీల్దార్ అడ్ల అనిల్ కుమార్ హెచ్చరికలు జారీ చేశారు.