కొనుగోళ్లు వేగవంతం చేయాలి
12-11-2025 12:55 AM
మోతె నవంబర్ 11:- కొనుగోలు కేంద్రాలలో ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని మండల ప్రత్యేక అధికారి సీతారామ్ నాయక్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని మామిళ్ళ గూడెం, హుస్సేనబాద్, మోతె గ్రామాల ఐ కె పి కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ మ్యాచర్ ను సరి చూసి ధాన్యం మ్యాచర్ రాగానే వెంటనే కాంటాలు వేసి రైతులకు ఇబ్బందులు కలుగ కుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
రైతులందరు ప్రభుత్వం పెట్టిన కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకరావాలని కోరారు. దళారీల మాటలు నమ్మొద్దని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి యం. సౌమ్య, వి బి కె నాగమణి, రైతులు లింగయ్య, నాగిరెడ్డి, వెంకన్న ,తదితరులు పాల్గొన్నారు.




