calender_icon.png 20 February, 2026 | 9:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏసీబీకి చిక్కిన ఇద్దరు పాఠశాల విద్యాశాఖ ఉద్యోగులు

20-02-2026 12:04:15 AM

సీబీఎస్‌ఈ స్కూల్ ఎన్‌ఓసీకి రూ.70 వేలు డిమాండ్

హైదరాబాద్, ఫిబ్రవరి 19 (విజయక్రాంతి): పాఠశాల విద్యాశాఖలో ఇద్దరు ఉద్యోగులు ఏసీబీకి పట్టుబడ్డారు. లంచం డిమాండ్ చేస్తూ ఏసీబీకి పట్టుబడిన వారిలో హైదరాబాద్ సైఫాబాద్‌లోని కమిషనర్ అండ్ డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్‌లో పనిచేసే సూపరింటెండెంట్ సంగీన ఫణిరాజ్, రంగారెడ్డి డీఈవో కార్యాలయంలో పనిచేసే సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ ఉన్నారు.

2026 విద్యాసంవత్సరానికి సంబంధించి ఓ సీబీఎస్‌ఈ పాఠశాలకు ఎన్‌ఓసీ సర్టిఫికెట్ జారీ చేసేందుకుగానూ రూ.70 వేలు డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించి వారిని పట్టుకన్నట్లు గరువారం ఒక ప్రకటనను విడుదల చేశారు. ఆ ఇద్దర్ని అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరిచినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.