8 March, 2026 | 12:23 PM

మహిళలను వేధించిన ఇద్దరు ఆకతాయిలు అరెస్ట్

07-03-2026 12:00 AM

నాగర్‌కర్నూల్, మార్చి 6 (విజయక్రాంతి)నాగర్కర్నూల్ బస్టాండ్ ఆవరణలో మహిళలను వేధిస్తున్న ఇద్దరు ఆకతాయిలను జిల్లా షీ టీం పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళలను వేధిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని షీ టీం ఎస్త్స్ర రజిత హెచ్చరించారు.బస్టాండ్ ప్రాంతంలో మహిళలను వేధిస్తున్నారని వచ్చిన సమాచారంతో షీ టీం ఎస్త్స్ర రజిత, ఏఎస్‌ఐ విజయలక్ష్మి మాఫ్టీలో వెళ్లి నిఘా పెట్టారు.

మహిళలను వేధిస్తున్న ఇద్దరు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు.మహిళల భద్రత కోసం జిల్లా షీ టీం నిరంతరం పనిచేస్తోందని ఎస్త్స్ర రజిత తెలిపారు. మహిళలు ఎవరైనా వేధింపులు లేదా సతాయింపులకు గురైతే భయపడకుండా వెంటనే జిల్లా షీ టీం నంబర్ 8712657676 లేదా డయల్ 100 ను సంప్రదించాలని ఆమె సూచించారు.