ద్విచక్ర వాహనాల దొంగలు అరెస్ట్
కడ్తాల్, జూన్5,(విజయ క్రాంతి ): ద్విచక్ర వాహనాల దొంగలను అరెస్టు చేసి 8 వాహనాలు స్వాధీనం చేసుకున్నామని కడ్తాల్ సీఐ సైదిరెడ్డి తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం రాత్రి సీఐ సైదిరెడ్డి పర్యవేక్షణలో పోలీసులు నిర్వహించిన వాహనాల తనిఖీలలో భాగంగా ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న ఇద్దరి నిందితులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. వారి నుండి దొంగలించిన వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు.
నిందితులు జటావత్ చరణ్ (19), చంద్రాయన్ పల్లి తండా, ఆమనగల్లు మండలం ఇస్లావత్ అనిల్ బోడియా తండ, తలకొండపల్లి మండలం, పోలీసుల విచారణలో మరో నిందితుడు కిల్లంపల్లి రాజశేఖర్ (21), ఈ చోరీలకు ప్రధాన సూత్రధారి అని సీఐ చెప్పాడు. కడ్తాల్, చౌటుప్పల్, ఆదిభట్ల, చిట్యాల, తదితర ప్రాంతాలలో పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలను దొంగతనం చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారని సీ ఐ తెలిపారు.
దొంగలించిన మోటార్ సైకిల్ లను రికవరీ చేయడంలో కీలక పాత్ర పోషించిన పోలీస్ సిబ్బందిని సిఐ సైదిరెడ్డి అభినందించారు. ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి, డీసీపీ నారాయణరెడ్డి, ఏసీపీ జానకి రెడ్డి లను పోలీసులను అభినందించారు. ప్రతిభ కనబరిచిన పోలీసులకు రివార్డులు అందజేస్తామని తెలిపారు. దొంగల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఐ వాహనదారులకు సూచించారు.






