28 June, 2026 | 3:35 PM

Breaking News

రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •  

ఫ్లైఓవర్పై నుంచి పడి ఇద్దరు యువకుల మృతి

04-08-2024 08:53 PM

హైదరాబాద్: అతి వేగం ఇద్దరు యువకుల ప్రాణాలను బలి తీసుకుంది. ఈ ఘటన గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ రోహిత్(27), జాబ్ సెర్చింగ్‌లో ఉన్న బాలప్రసన్న(26) మియాపూర్‌లో నివాసం ఉంటున్నారు. ఆదివారం తెల్లవారు జామున సుమారు 4 గంటల ప్రాంతంలో మసీద్‌బండ నుంచి హఫీజ్‌పేట్ వైపు బైక్‌పై వెళ్తున్నారు.

కొత్తగూడ ఫ్లుఓవర్‌పై అతి వేగంగా, నిర్లక్ష్యంగా బైక్ నడపడంతో ఫ్లుఓవర్ గోడను ఢీకొని కిందపడ్డారు. ఈ ప్రమాదంలో ఇద్దరి తలలకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు గమనించి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, చికిత్సపొందుతూ ఇద్దరూ మృతి చెందారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.