14-01-2026 02:36:06 AM
ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్
జీజీహెచ్ లో యూడీఐడీ బ్లాక్ విభాగం ఏర్పాట్ల పరిశీలన
రాజన్న సిరిసిల్ల, జనవరి 13(విజయ క్రాంతి): యూడీఐడీ బ్లాక్ విభాగం పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఇంచార్జి కలె క్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించా రు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ జనరల్ హా స్పిటల్ జీజీహెచ్లో యూడీఐడీ కేంద్రం కోసం బ్లాక్ విభాగం, ప్ర త్యేక టాయిలెట్ నిర్మాణ పనులు, ఫర్నిచర్, ఇతర పనులను మంగళవారం పరిశీలించారు. యూడీఐడీ బ్లాక్ విభాగం ప్రవేశ ద్వారం వద్ద నేమ్ బోర్డు రాయించాలని, గోడలపై రంగులు వేయించాలని, ఆవరణ అంతా ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని సూచించారు. యూడీఐడీ కోసం వచ్చే దివ్యాంగులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని, త్వరగా పనులు పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు.
వంట గది ఆకస్మిక తనిఖీ
గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో పేషెంట్లకు భోజనాలు సిద్దం చేసే గదిని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఈ సందర్భంగా ఆహార పదార్థాలు సిద్దం చేస్తుండగా, వాటి నాణ్యతను, మెనూ, ఫ్రిడ్జ్, కూరగాయలు, గుడ్లు, ఆరటి పండ్లు, బియ్యం, పప్పులు పరిశీలించారు. వంట గదిలో పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. నిర్వహణపై కాంట్రాక్టర్ కు పలు సూచనలు చేసారు. పరిశీలనలో డీఆర్డీఓ గీత, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రవీణ్, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ సంతోష్ కుమార్, సీఎస్ ఆర్‌ఎంఓ డాక్టర్ సుమన్ మోహన్ రావు, డిప్యూటీ సీఎస్ ఆర్‌ఎంఓ డాక్టర్ కాశీనాథ్, మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా, డీఈ వాణి, డీపీఎం రవీందర్ తదితరులు పాల్గొన్నారు.