calender_icon.png 14 January, 2026 | 10:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జన్యుమార్పిడి విత్తనాలతో ఆరోగ్యాలకు నష్టం

14-01-2026 02:37:19 AM

  1. గ్లుపోసైట్, హెచ్‌టీ, బీటీ పత్తివిత్తనాలు వాడొద్దు 
  2. రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి  

హైదరాబాద్, జనవరి 13 (విజయక్రాంతి): హెచ్‌టీ, బీటీ పత్తి విత్తనాలు, గ్లుపోసైట్ కలుపు మందును రైతులు వాడొద్దని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ రెండింటిని కేంద్ర ప్రభుత్వం నిషేదించిందన్నారు. ఈ కలుపు మందు చల్లడం వల్ల మట్టి విషతుల్యమవుతుందని ఆయన తెలిపారు. మంగళవారం ఆయన బీఆర్కే భవన్‌లోని రైతు కమిషన్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ నకిలీ పత్తి విత్తనాలు మార్కెట్‌లోకి చాలా వచ్చాయని, రైతులు గమనించి కొనాలని సూచించారు. జన్యుమార్పిడి విత్తనాలతో ప్రజల అరోగ్యా లు పాడవుతాయని, అందుకే 2006లో అప్పటి యూపీఏ ప్రభుత్వం నిషేధించింద న్నారు.

రైతులు గ్లుపోసైట్ కలుపు మందును ఎవరైనా పట్టుకున్న, ముట్టుకున్న ప్రమాదం ఉంటుందన్నారు. ఈ కలుపు మందును ఆదిలాబాద్ జిల్లాల్లో అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నట్లుగా తమ దృష్టికి వచ్చిందని, రైతులు ఈ కలుపు మందులు వాడొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో విత్తన కంపెనీలపై ప్రభుత్వానికి ఎలాంటి బాధ్యతలేకుండా ప్రయివేట్ కంపెనీలకే అధికారాలు ఇచ్చారని ఆయన విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తెచ్చిన సీడ్ ముసాయిదా కూడా కంపెనీలకు అనుకూలంగా ఉందని విమర్శించారు. వచ్చే బడ్జెట్ సెషన్ లో బిల్లు పెట్టాలని చూస్తున్నారని విమర్శించారు.