calender_icon.png 14 January, 2026 | 10:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం రేవంత్‌పై అనుచిత వ్యాఖ్యలు తగదు

14-01-2026 02:35:52 AM

  1. తలసాని బెదిరింపులకు ఎవ్వరు భయపడరు 
  2. మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేఖ బోయలపల్లి 

హైదరాబాద్, జనవరి 13 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన అ నుచిత, బెదరింపు వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి విరుద్దమని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు డాక్టర్ రేఖ బోయలపల్లి మండిపడ్డారు. రాజకీయంగా విమర్శలు చేసుకోవడానికి అవకా శం ఉంటుందని, కానీ బెదిరింపు దూషణలు చేయడం సరికాదని మంగళవారం ఆమె ఒక ప్రకటనలో విమర్శించారు.

ఇలాంటి బెదిరింపులకు భయపడేవారు లేరనే విషయం గు ర్తుంచుకోవాలని ఆమె హెచ్చరించారు. మహిళా రిజర్వేషన్లు సమర్థవంతంగా అమ లు చేయాలంటే డీలిమిటేషన్ తప్పనిసరిగా చేయాల్సి ఉంటుందని రేఖ బోయలపల్లి స్పష్టం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సాధికా రత, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా ముందుకు సాగుతోందన్నారు.తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రజాస్వామ్యబద్దంగా పాలన సాగుతుందనే విషయం తలసాని తెలుసుకోవాలని ఆమె హితవు పలికారు.