ఠంయ్యాల శ్రీధరాచార్యులకు ఊగాది పురస్కారం
వరంగల్, మార్చి 16 (విజయక్రాంతి): వరంగల్ ఎల్ బి నగర్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల (మాసూమ్ అలి) లో తెలుగు భాష ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న, తెలంగాణ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, ప్రముఖ వ్యాఖ్యాత, గాయకులు ఠంయ్యాల శ్రీధరా చార్యులు జే బీ కల్చరల్ ఆరట్స్ వారి ఊగాది పురస్కారం అందుకున్నారు.
జే బీ కల్చరల్ ఆరట్స్ జడల హరిత శివ ఆధ్వార్యాన పబ్లిక్ గార్డెన్ లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిధి గ్రేటర్ వరంగల్ కాంగ్రేస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజనాల శ్రీహరి ఠంయ్యాలకు అవార్డు అందచేసారు. ఈ కార్యక్రమంలో ఈగ మల్లేశం, డాక్టర్ రుక్మిణి, సీతామహాలక్ష్మీ, యాదగిరి ప్రసాద్, ప్రవీణ్, నిమ్మల శ్రీనీవాస్, సుశీల, పులి గణేష్, వల్లాల రమేష్ , స్వప్న, రంగనాధ్, సృజన్ , శ్రీమన్నారయణ, ఆశోక్ తదితరులు పాల్గొన్నారు.




