18 March, 2026 | 8:35 PM

మంథని డిగ్రీ కళాశాలలో ఘనంగా ముందస్తు ఉగాది వేడుకలు

18-03-2026 05:05 PM

మంథని,(విజయక్రాంతి): స్థానిక ముంథని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఐక్యూఏసీ, తెలుగు విభాగం ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా ముందస్తు ఉగాది వేడుకలను నిర్వహించారు. కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్  పరిషయ్య  మాట్లాడుతూ... తెలుగువారి నెలలు చైత్రమాసంతో మొదలై ఫాల్గుణ మాసంతో ముగుస్తుందని, తెలుగువారికి మొదటి పండుగ ఉగాదితో ప్రారంభమవుతుంది.

ఇదే యుగానికి ఆరంభంగా ఉందని పురాణాలు చెబుతున్నాయని, అందరూ ఆనందంగా ఈ పండుగ జరుపుకోవాలని ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. కళాశాల తెలుగు విభాగం అధ్యాపకురాలు మానస, మాట్లాడుతూ ఉగాది పండుగ విశిష్టతలైన ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణం గురించి, ఈ పరాభవ నామ సంవత్సర విశిష్టత గురించి తెలియజేశారు. అనంతరం విద్యార్థులకు ఉగాది పచ్చడి, భక్షాలు అందించారు.