22 May, 2026 | 7:43 PM

Breaking News

ఎస్ఐ శ్రీకాంత్‌గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన గిరిజన నాయకులు   •   కార్మికులకు రూ.30 వేల కనీస వేతనం ఇవ్వాలి- సీఐటీయూ   •   బీడీ కార్మికులందరికీ చేయూత పథకం ద్వారా 4000 పింఛన్ ఇవ్వాలి   •   వేసవి శిక్షణ శిబిరాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి   •   ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు బలి   •   పీఏసీఎస్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన మారినేని సుధీర్ రావు   •   వేతన పెంపు హర్షణీయం: మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్   •   కామారెడ్డి డిఆర్డిఓగా దామోదర్ రెడ్డి   •   దోమకాటు వ్యాధుల పట్ల... ప్రజలకు అప్రమత్తత అవసరం   •   సర్కారు భూముల్లో అక్రమ నిర్మాణాలను సహించేది లేదు   •  

నేరెళ్లలో ఉగాది సంబరాలు – విద్యార్థులతో కలిసి పచ్చడి సేవించిన సర్పంచ్

18-03-2026 05:39 PM

తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం నేరెళ్ల గ్రామ ప్రాథమిక పాఠశాలలో ఉగాది పండుగను ముందస్తుగా ఆనందోత్సాహాలతో నిర్వహించారు. సర్పంచ్ పొన్నం లక్ష్మణ్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఉగాది పండుగ ప్రాముఖ్యతను వివరించి, షడ్రుచుల ద్వారా మన జీవితం లోని వివిధ అనుభవాలను అర్థం చేసుకోవచ్చని తెలిపారు.

అనంతరం విద్యార్థులతో కలిసి ఉగాది పచ్చడిని సేవించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు దుబ్బాక ప్రభాకర్, గ్రామ కార్యదర్శి సతీష్, ఉపాధ్యాయులు కావ్య, లావణ్య, పావని, మధ్యాహ్న భోజన సిబ్బంది ఎల్లవ్వ, లక్ష్మి, ఆయా లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు సంప్రదాయ పండుగలపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా నిలిచింది.