22 May, 2026 | 8:53 PM

Breaking News

'డ్రంక్ అండ్ డ్రైవ్'లో రూ.2లక్షలకుపైగా జరిమానా   •   భిక్కనూరులో ఆర్టీసీ బస్సు ప్రమాదం.. ప్రయాణికులు సురక్షితం   •   ప్రతి ఒక్కరూ వేసవి జాగ్రత్తలు తీసుకోవాలి   •   జాన్కంపేట పీటీసీలో ఫైరింగ్ ట్రైనింగ్.. జాగ్రత్త   •   శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు: ఎస్సై ప్రవీణ్ కుమార్   •   బోధన్ డివిజన్ పోలీస్ అధికారులతో నేరాల నియంత్రణ కోసం సమీక్ష సమావేశం -సిపి   •   బాధిత కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర పెరిక కార్పొరేషన్ చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు   •   జిన్నారం ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త పరీక్షలకు బ్రేక్..!   •   జిన్నారం ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త పరీక్షలకు బ్రేక్..!   •   ఎస్ఐ శ్రీకాంత్‌గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన గిరిజన నాయకులు   •  

నారాయణపూర్‌లో ఘనంగా శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లికి బోనాలు

18-03-2026 05:42 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని నారాయణపూర్ గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయం వద్ద బోనాల ఉత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య బుధవారం ఘనంగా నిర్వహించారు. ఇటీవల నిర్మించిన ఆలయంలో నిర్వహించిన ఈ వేడుకల్లో అంబేద్కర్ కాలనీకి చెందిన మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా డప్పు చప్పుళ్ల నడుమ భక్తులు ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు.

సంప్రదాయ వేషధారణలో మహిళలు తలపై అలంకరించిన బోనాలు మోసుకుంటూ ఆలయానికి చేరుకోవడం ఆకట్టుకుంది. ఊరంతా పండుగ వాతావరణంలో మునిగిపోయి, భక్తి పరవశంతో కళకళలాడింది. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి మహామంగళహారతులుఅందించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. గ్రామంలో శాంతి, సౌభాగ్యం నెలకొలవాలని భక్తులు అమ్మవారిని ప్రార్థించారు. ఈ కార్యక్రమం లో  గ్రామ ప్రజలు, మహిళా లు  పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా బోనాలు జరుపుకున్నారు.