20-12-2025 12:00:00 AM
నిజాంపేట, డిసెంబర్ 19 : ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద నిరుపేద కుటుంబాలకు ఉచిత గ్యాస్ కనెక్షన్ కేంద్ర ప్ర భుత్వం అందజేస్తుందని సర్పంచ్ చిన్మనమై న శైలజ శ్రీనివాస్ అన్నారు. నిజాంపేట మండలం బచ్చు రాజు పల్లి గ్రామంలో 12 మంది లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్లను పం పిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ.. ప్రతి ఒక్కరు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉజ్వల గ్యాస్ స్కీమును సద్వినియో గం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాజశేఖర్, వార్డు సభ్యులు ఉన్నారు.