calender_icon.png 20 December, 2025 | 4:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్న బీజేపీ

20-12-2025 12:00:00 AM

వెంకటాపురం(నూగూరు),డిసెంబర్19,(విజయక్రాంతి): జాతీయ ఉపాధి హామీ పథకాన్ని బిజెపి ప్రభుత్వంనిర్వీర్యం చేస్తుందని సిపిఐ ములుగు జిల్లా కార్యదర్శి తోట మల్లికార్జునరావు ఆరోపించారు. శుక్రవారం ఆ యన పత్రికలకు ఓ ప్రకటన విడుదల చేశా రు. కార్మిక చట్టాలను మారుస్తూ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పేరును తొలగిస్తూ ఈరోజు పార్లమెంట్లో తీసుకున్న నిర్ణయం దుర్మార్గమన్నారు.వారి ఇష్టానికి హద్దులు లేకుండా పోతుందని, తాము కోరుకున్న ప్రకారం పెట్టుబడిదారులకు, ధనికులకు లా భం చేకూర్చే విధంగా ఉందని విమర్శించా రు.

ఈరోజు పార్లమెంట్లో చేసిన తీర్మానం వారి కనుసన్నల్లో ఏది అనుకుంటే అదే చే యాలని చూస్తున్నారని ఆరోపించారు. కూ లీలకు కనీస వేతనం ఎంత అనేది తెలియజేస్తే బాగుంటుందని, సక్రమమైన పద్ధతిలో చేయని యెడల కమ్యూనిస్టు పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తే భవిష్యత్తులో కార్మికులతో మీ యొక్క చర్యల్ని ఖండిస్తూ ఉద్యమాలకు వెనకాడబోమని ఈ సందర్భంగా తెలియజేశారు.