లిఫ్ట్ ఇరిగేషన్ నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక
మఠంపల్లి,(విజయక్రాంతి): మండల పరిధిలోని పెదవీడు లిఫ్ట్ ఇరిగేషన్ నూతన కమిటీ ఎన్నిక స్థానిక పంచాయితీ ఆవరణలో ఏకగ్రీవంగా జరిగింది.మంగళవారం రైతుల సమక్షంలో జరిగిన ఈ ఎన్నికల్లో నూతన కమిటీ అధ్యక్షుడిగా షేక్ కరీం, కోశాధికారిగా ఆదినారాయణ రెడ్డి ఎన్నికయ్యారు.అదే విధంగా గౌరవ అధ్యక్షుడిగా సర్పంచ్ అమరారపు వెంకటేశ్వర్లు,సలహాదారులుగా అన్నెం నర్సి రెడ్డి, మొగిలి మట్టపల్లి యాదవ్ తదితరులను రైతులు ఎన్నుకున్నారు.
ఎన్నికల అనంతరం నూతన కమిటీ సభ్యులను గ్రామ రైతులు, ప్రజాప్రతినిధులు అభినందించారు. ఈ సందర్భంగా నూతన కమిటీ చైర్మన్ కరీం మాట్లాడుతూ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ద్వారా రైతులకు సకాలంలో సాగునీరు అందేలా కృషి చేస్తామని తెలిపారు. కాలువల నిర్వహణ,మోటార్ల మరమ్మతులు,విద్యుత్ సరఫరా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారు.రైతులందరి సహకారంతో లిఫ్ట్ ఇరిగేషన్ వ్యవస్థను మరింత బలోపేతం చేసి వ్యవసాయాభివృద్ధికి కృషి చేస్తామని నూతన కమిటీ సభ్యులు పేర్కొన్నారు.






