calender_icon.png 14 January, 2026 | 10:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదంలో మామ, అల్లుడు మృతి

14-01-2026 09:06:15 PM

పండగపూట విషాదం నింపిన సంఘటన

బెజ్జూర్,(విజయక్రాంతి): బెజ్జూర్ మండలంలోని కుంటల–మాలపల్లి అందుగులగూడ ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనం అదుపుతప్పి వంతెనపై నుంచి ఒర్రె కింద పడటంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కౌటాల మండలానికి ముత్తంపేట్ గ్రామానికి చెందిన రాజశేఖర్ అక్కడికక్కడే మృతి చెందగా, బెజ్జూర్ మండలంలోని దుబ్బగూడా గ్రామానికి చెందిన బోర్‌కుట్  శంకర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన శంకర్‌ను వెంటనే 108 అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మామ సైతం మృతి చెందడంతో రెండు గ్రామాలలో విషాద ఛాయలు అల్ముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.