calender_icon.png 14 January, 2026 | 10:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంక్రాంతి సందర్భంగా క్రికెట్ పోటీలు

14-01-2026 09:02:34 PM

బీబీపేట,(విజయక్రాంతి): బీబీపేట మండలం యాడారం, శివార్ రాంరెడ్డిపల్లెలో కీర్తిశేషులు తోటపల్లి నర్సింగరావు వారి జ్ఞాపకార్థం సంక్రాంతి పండగ పురస్కరించుకొని బుధవారం క్రికెట్ టౌర్నమెంట్ నిర్వహించారు.  ఈ కార్యక్రమాన్ని యాడారం గ్రామ సర్పంచ్  గొబ్బూరి సుధారాణి బాపురెడ్డి , తోటపల్లి సంతోష్ రావ్, బిజెపి మండల ఉపాధ్యక్షులు భరత్ రాజు బట్టు  ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ యువతను చెడు వ్యసనాలకు దూరం చేసి శారీరకంగా, మానసికంగా, చురుగ్గా ఉంచేందుకే ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం క్రికెట్ పోటీలో గెలిచిన వారికి బహుమతులు అందజేశారుఈ కార్యక్రమంలో గ్రామ యువకులు , క్రీడ ఔత్సాహికులు పాల్గొన్నారు.