14-01-2026 09:09:02 PM
గుండాల,(విజయక్రాంతి): గ్రామీణ క్రీడాకారులకు ఎల్లప్పుడూ ప్రోత్సాహం ఉంటుందన్నారు, సుద్దాల గ్రామ సర్పంచ్ గడ్డమీది మహోదయ గౌడ్. సంక్రాంతి ఉత్సవాలను పురస్కరించుకొని బుధవారం సుద్దాల యూత్ ఆధ్వర్యంలో మండల స్థాయి క్రీడా పోటీలను నిర్వహించారు. వాలీబాల్ క్రీడలో ప్రథమ బహుమతి బ్రాహ్మణపల్లి, రెండో బహుమతి సుద్దాల టీంలు, కబడ్డీలో సుద్దాల లయన్స్ యూత్ మొదటి బహుమతులు గెలుచుకున్నారు.
గెలుపొందిన విజేతలకు ప్రైజ్ మనీతో పాటుగా సీల్డ్ లు అందజేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ జిల్లా వైస్ చైర్మన్ గడ్డమీది పాండరీ, ఉప సర్పంచ్ కాసం నగేష్, మాజీ ఎంపీటిసి బడక మల్లయ్య, మాజీ ఉపసర్పంచ్ బత్తిని రవి, కొండపల్లి మొగులాల్, కుమార్, భిక్షం, క్రీడా నిర్వాహకులు, ప్రజలు క్రీడాకారులు పాల్గొన్నారు.