calender_icon.png 4 May, 2025 | 5:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీ ఆధ్వర్యంలో గావ్ చలో బస్తీ చలో

14-04-2025 12:00:00 AM

 మేడ్చల్ అర్బన్ ఏప్రిల్ 13(విజయ క్రాంతి): మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని కిష్టాపూర్ లో బిజెపి ఆధ్వర్యంలో  గావ్ చలో  బస్తీ చలో కార్యక్రమంలో భాగంగా ప్రజలను కలిసి వార్డు సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ మోడీ పాలనలో దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని కార్యకర్తల త్యా గం, సేవా భావంతో బీజేపీ ప్రజలలో విశ్వాసాన్ని సంపాదించిందని అన్నారు.

  రాబో యే రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు.  ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధ్యక్షురాలు జెల్లీ శైలజ హరినాథ్, జిల్లా ఉపాధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి,  నాయకులు జాకట ప్రేమ్ దాస్, చేరుకొమ్ము శ్రీనివాస్ గౌడ్ , హేమలత రెడ్డి,టైలర్ రాజు, బూత్ అధ్యక్షులు అర్జున్,డి. విక్రమ్,వంశీధర్ రెడ్డి, నర్సింగ్ రావు, వెంకటేష్ , మధుసూదన్ రెడ్డి, అభిలాష్ రెడ్డి, జాకట బాబు రాజు, రతన్ రాథోడ్, సురేష్, శ్రవణ్ రాజ్, కేశవా రెడ్డి,అవినాష్,భరత్ వంజరి, సుజీత్ కుమార్ తదితరులు  పాల్గొన్నారు.