14-04-2025 12:00:00 AM
మెదక్ ఎంపీ రఘునందన్‌రావు
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి దీపారాధన
సిద్దిపేట, ఏప్రిల్ 13 (విజయక్రాంతి) : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కు భారత రత్న అవార్డు ఇచ్చింది బీజేపీనే అని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా అధ్యక్షులు బైరి శంకర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఆదివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోనీ పాత బస్టాండ్ వద్ద గల డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ విగ్రహానికి శుద్ధి కార్యక్రమం నిర్వహించి, దీపారాధన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ బీసీ సంక్షేమ కోసం పని చేస్తున్న అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ రాష్ర్టంలో ఇద్దరికీ మాత్రమే మంత్రి పదవులు ఇచ్చారని విమర్శించారు.
దేశంలో అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ తన కుటుంబ సభ్యులకు మాత్రమే భారత రత్న అవార్డు ఇచ్చారని వెల్లడించారు. రాష్ర్టం ఏర్పడితే దళితులకు ముఖ్యమంత్రినీ చేస్తామని అన్ని పదవులు ఆ కుటుంబమే అనుభవించిందని పరోక్షంగా బి ఆర్ ఎస్ పై విమర్శలు చేశారు. దేశంలో అధికారంలోకి చేపట్టి దళితులను, గిరిజనులను, మైనార్టీలను రాష్ర్టపతిని చేసిన ఘనత బిజెపి పార్టీకి దక్కిందన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలంటూ నినాదా లు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.