calender_icon.png 4 May, 2025 | 2:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

అంబేద్కర్ ఆశయ సాధన కోసం పనిచేయాలి

14-04-2025 12:00:00 AM

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

రామేశ్వరంబండలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ

భవన నిర్మాణానికి హామీ

పటాన్ చెరు, ఏప్రిల్ 13 : రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలు, ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరు పనిచేయాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. పటాన్ చెరు మండలం రామేశ్వరంబండ గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పం అంతిరెడ్డి సొంత నిధులతో ఏర్పాటు చేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఆదివారం సాయంత్రం ఎమ్మెల్యే  ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కోసం జీవితాంతం పని చేసిన గొప్ప నాయకుడు డాక్టర్ అంబేద్కర్  అని తెలిపారు.  నియోజకవర్గ వ్యాప్తంగా ఆయన విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు రూ.20 లక్షల సొంత నిధులతో అంబేద్కర్ భవనం నిర్మాణానికి త్వరలోనే శంకుస్థాపన చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పం ధరణి అంతి రెడ్డి, సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి, ఆంజనేయులు, నగేష్, శంకర్,  సురేష్, ఇబ్రహీం, అర్జున్, కిరణ్, రమేష్, దానయ్య, నవీన్, సర్దార్, సాయిలు, రాములు, లోకేష్, దశరథ్, యాదమ్మ, నగేష్ పాల్గొన్నారు.

క్రీడలకు, క్రీడాకారులకు సంపూర్ణ సహకారం :ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

క్రీడలకు, క్రీడాకారుల అభివృద్ధికి  తన సంపూర్ణ సహకారం ఎల్లప్పుడు ఉంటుందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. రామచంద్రాపురం మండలం  భారతి నగర్ డివిజన్ పరిధిలోని ఏంఐజీ కి చెందిన బాడీ బిల్డర్  శ్రీనివాస్ ఇటీవల ముంబైలో జరిగిన నాచురల్ బాడీ బిల్డింగ్ పోటీల్లో బంగారు పతకం సాధించాడు. ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని శ్రీనివాస్  మర్యాదపూర్వకంగా కలిశారు. జాతీయ స్థాయి పోటీల్లో బంగారు పతకం సాధించడం పట్ల ఎమ్మెల్యే సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ ను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు.