ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన
08-12-2024 12:57 AM
నిర్మల్, డిసెంబర్ 7 (విజయక్రాం తి): గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరు ఆర్థిక అక్షరాస్యత సాధించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. శనివారం జిల్లాలోని కడెం మండల కేంద్రంలో ఆర్థిక అక్షరాస్యతపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. చదువు ప్రాధాన్య తను ప్రతి ఒక్కరు గుర్తించాలని కలెక్టర్ కోరారు.




