8 April, 2026 | 11:34 PM

‘హామీలను అమలు చేస్తున్నాం’

08-12-2024 12:55 AM

నిర్మల్, డిసెంబర్ 7 (విజయక్రాంతి): ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలతోపాటు ఆరు గ్యారెంటీలను అమలు చేస్తున్నామని డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు అన్నారు. శనివారం సారంగపూర్ మండలంలోని వంజర్ గ్రామంలో నిర్వహించిన ప్రజా పాలన విజయోత్సవ సంబురాల్లో పాల్గొన్నారు. రైతులు, కాంగ్రెస్ నాయకులతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రైతాంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం రూ.2 లక్షల రుణమాఫీ చేసిందన్నారు. సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తున్నదన్నారు.