9 April, 2026 | 3:11 AM

అమరవీరుల కుటుంబాలను ఆదుకోవాలి

08-12-2024 01:02 AM

తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్ పులిగారి గోవర్ధన్‌రెడ్డి

ముషీరాబాద్, డిసెంబర్ 7: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అమరులైన వారి కుటుంబాలకు ఆదుకోవాలని, అందుకోసం ప్రత్యేక పథకాన్ని ప్రకటించాలని తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్ పులిగారి గోవర్ధన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం ఆయన రంగారెడ్డి జిల్లా న్యాయవాదులతో కలిసి ఏర్పా టు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాజకీయ చరిత్రలో డిసెంబర్ 9కి ఎంతో విశిష్టత ఉందన్నారు.

తెలంగాణ రాష్ట్రం కోసం ఎందరో యువకులు అమరులవుతున్న పరిస్థితుల్లో 2009 డిసెం బర్ 9న సోనియా గాంధీ ఒక తల్లిగా స్పందించి తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను ప్రారంభించారని గుర్తు చేశా రు.

రాష్ట్ర సచివాలయం ప్రాంగణం లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అమరులైన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అం దించేందుకు ప్రభుత్వం ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టాలని అన్నారు.

కార్య క్రమంలో రంగారెడ్డి జిల్లా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు వై కొండల్ రెడ్డి, ఉపాధ్యక్షుడు కొండల్ రెడ్డి, జీ కృష్ణ, న్యాయవాదులు కీర్తి కుమారి, పీ సురేశ్, రాంచందర్ పాల్గొన్నారు.