calender_icon.png 31 July, 2025 | 4:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేడ్చల్ లో గుర్తుతెలియని మృతదేహం

30-07-2025 08:33:38 PM

మేడ్చల్ అర్బన్: గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కండ్లకోయ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద గుర్తించినట్లు మేడ్చల్ పోలీసులు(Medchal Police) తెలిపారు. బుధవారం స్థానికుల సమాచారం మేరకు కండ్లకోయలోని అవుటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్డుకు చేరుకోగా అక్కడ సుమారు 45 నుండి 50 సంవత్సరాలు గల గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభించినట్లు పోలీసులు మీడియాకు వెల్లడించారు. సదరు వ్యక్తి మృతదేహాన్ని హైదరాబాద్ గాంధీ ఆసుపత్రి మార్చరికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. మృతి చెందిన వ్యక్తి ఆచూకీ తెలిసినవారు మేడ్చల్ పోలీసులను సంప్రదించాలని వారు సూచించారు.