11 May, 2026 | 1:39 AM

దక్షిణాదిలో ఒక్కసీటూ తగ్గదు!

27-02-2025 12:49 AM

తమిళనాడు సీఎం స్టాలిన్ మాటల్లో నిజంలేదు

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కీలకవ్యాఖ్యలు

చెన్నై, ఫిబ్రవరి 26: లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తమిళనాడు 8 స్థానాలను కోల్పోతుందన్న ఆ రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్ వాద నను కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తోసిపుచ్చారు. ఏ దక్షిణాది రాష్ట్రం తమ సీట్లను కోల్పోదని స్పష్టం చేశారు. తమిళనాడులోని కోయంబత్తూర్‌లో జరిగిన ఓ కార్యక్రమం లో ఆయన మాట్లాడుతూ.. దక్షిణాదిలో ఏ రాష్ట్రానికి సీట్లు తగ్గవని గతంలోనే ప్రధాని నరేంద్రమోదీ లోక్‌సభలో స్పష్టం చేశారని గుర్తుచేశారు.