సిటీ సివిల్ కోర్టుకు కేంద్రమంత్రి బండి సంజయ్
సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించిన బండి సంజయ్
హైదరాబాద్: కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ సిటీ సివిల్ కోర్టును(s City Civil Court) ఆశ్రయించారు. పోక్సో కేసులో భవిష్యత్తులో తన పేరు వాడొద్దని బండి సంజయ్ పిటిషన్ వేశారు. ఇప్పటివరకు వాడిన తన పేరుపై వీడియోలు తొలగించాలని బండి సంజయ్ కోర్టును కోరారు. బండి భగీరథ్ కేసులో సిటీ సివిల్ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బండి భగీరథ్ కేసులో బండి సంజయ్ పేరు వాడొద్దంటూ కోర్టు గ్యాగ్ ఆర్డర్ వేసింది. బండి సంజయ్ పేరును ఎక్కడా ఉపయోగించొద్దని సివిల్ కోర్టు తేల్చి చెప్పింది. తన పేరును ఉపయోగిస్తూ మీడియాలో ఎలాంటి వార్తలు రాయకుండా చూడాలని కోర్టును కోరారు.
సోషల్ మీడియాలో బాలిక వివరాలు ప్రచారంపై కేసు
బండి భగీరథ్ కేసులో బాలిక వివరాలు సోషల్ మీడియాలో ప్రచారంపై కేసు నమోదైంది. మేడ్చల్ జిల్లా బాలల సంక్షేమ కమిటీ ఛైర్ పర్సన్ ఫిర్యాదు మేరకు కేసు బుక్ చేశారు. సోషల్ మీడియాలో బాలిక ఫోటోలు, వీడియోలు, తల్లిదండ్రుల వివరాల ప్రసారంపై కేసు నమోదు చేశారు. సోషల్ మీడియా నిర్వాహకులపై కేసులు పెట్టాలని పెట్ బషీరాబాద్ పోలీసులు తెలిపారు.






