15 May, 2026 | 6:33 PM

కర్నాటకలో ఘోరప్రమాదం.. ఆరుగురు మృతి, 10 మంది పరిస్థితి విషమం

15-05-2026 05:20 PM

మునీరాబాద్: కర్నాటకలో(Karnataka) ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. మునీరాబాద్ దగ్గర బ్రిడ్జి(Munirabad Bridge) పైనుంచి ట్రాక్టర్ పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. 10 మంది పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.