09-12-2025 02:31:52 PM
న్యూఢిల్లీ: ఇండిగోపై(IndiGo crisis) కేంద్ర పౌరవిమానయాన శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇండిగో సంక్షోభంపై లోక్‌సభలో కేంద్ర విమానయాన మంత్రి రామ్ మోహన్ నాయుడు కింజరపు కీలక ప్రకటన చేసింది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్ కతా, హైదరాబాద్ సహా ప్రధాన ఎయిర్ పోర్టుల్లో సీనియర్ అధికారుల బృందం అధ్యయనం చేయనుంది. రామ్మోహన్ నాయుడు(Union Aviation Minister Ram Mohan Naidu) సభ ముందు వివరణ ఇచ్చారు. కొత్త నిబంధనలు పాటిస్తామని ఇండిగో వివరణ ఇచ్చిందని రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రయాణికుల భద్రతే ముఖ్యమని, ప్రయాణికులు ఇబ్బంది పడితే యాజమాన్యాలదే బాధ్యతన్నారు. ఇండిగోపై సమగ్ర విచారణకు ఆదేశించామని తెలిపారు. ప్రతి ప్రయాణికుడు సురక్షితంగా ప్రయాణం చేయాలన్నారు.
ఇండిగో ఇప్పటికే రూ. 750 కోట్లు రీఫండ్ చేసిందని వెల్లడించారు. ఇప్పటికే ఇండిగో సీఈవో, సీవోవోలకు షోకాజు నోటీసులు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. విమానాల షెడ్యూల్ ను మార్చాలని, సిబ్బందిని పెంచాలని, ప్రయాణికుల సేవలు మెరుగుపర్చాలని, విమానాలు ఆలస్యం చేయకుండా రాకపోకలను సాధారణస్థితికి తేవాలని సూచించామని వివరించారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రస్తుతానికి సమస్య లేదని రామ్మోహన్ నాయుడు సభలో తెలిపారు. కొత్త సేఫ్టీ నిబంధనలు దశలవారీగా అమలు చేస్తామని చెప్పారు. ఇండిగో విమాన సర్వీసుల సంఖ్యలో కేంద్రం 5 శాతం కోత విధించింది. ఇండిగో రోజుకు 2,200 విమాన సర్వీసులు నడపనుంది. రోజుకు 110 సర్వీసులను తగ్గించాలని డీజీసీఏ ఆదేశించింది. విమాన సర్వీసుల కుదింపుపై ఇండిగో కసరత్తు చేస్తోంది.