ప్రశాంతంగా 10 పరీక్షలు
పకడ్బందీగా అధికారుల పర్యవేక్షణ
నిర్భయంగా పరీక్ష రాస్తున్న విద్యార్థులు
ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): పది పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఎల్లారెడ్డి పట్టణంలోని ఎల్లారెడ్డి బాలికల ఉన్నత పాఠశాల ఎల్లారెడ్డి గురుకుల పాఠశాల ఎల్లారెడ్డి ఆదర్శ పాఠశాలలో 717 మంది విద్యార్థులు కు ఎల్లారెడ్డి బాలికల పాఠశాలలో ఒక విద్యార్థి గైరాజరైనట్లు మండల విద్యాధికారి లింగాపురం రాజులు తెలిపారు. విద్యార్థులు పరీక్షలను ప్రశాంతంగా నిర్భయంగా వ్రాస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
పరీక్ష కేంద్రాల వద్ద పకడ్బందీగా అధికారులు పోలీసులు పర్యవేక్షణ కొనసాగుతున్నట్లు మండల విద్యాధికారి రాజులు తెలిపారు. పదవ తరగతి మొదటి పరీక్ష తెలుగు మొదటి పేపర్ అని ఎటువంటి ఆటంకం లేకుండా విద్యార్థులు ఆందోళన చెందకుండా ప్రశాంతంగా పది పరీక్షను రాస్తున్నట్లు ఆయన తెలిపారు. పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన మండల తాసిల్దార్ ప్రేమ్ కుమార్ నాయబ్ తాసిల్దార్ శ్రీనివాస్, ఎల్లారెడ్డి ఎస్ఐ బొజ్జ మహేష్ పలువురు అధికారులు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




