3 July, 2026 | 6:01 PM

Breaking News

కాంగ్రెస్ కు ప్రచార ఆర్భాటాలు తప్ప ప్రజా సంక్షేమం పట్టదు   •   కామ్రేడ్ అరుణోదయ నాగన్న మృతి ఉద్యమానికి తీరని లోటు   •   కేటీఆర్, హరీష్ లకు వార్తల్లో నిలవాలన్న తాపత్రయం.!   •   ఈవీఎంల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •   యూరియా రైతులకు సరిపడా అందించాలి   •   తెలంగాణలో ఏపీ పోలీసుల చర్యలు ఖండనీయం   •   సింగరేణి ప్రధాన కార్యాలయంలో శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట   •   37వ డివిజన్లో 77 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన   •   నవ మహిళా సాధికార కేంద్రంలో మహిళలకు చెక్కుల పంపిణీ   •   పసికందు కిడ్నాప్.. 72 గంటల్లో కేసును చేదించిన పోలీసులు   •  

సీఏఏపై కాంగ్రెస్ రాజకీయాలు

19-08-2024 01:05 AM

కేంద్ర హోంమంత్రి అమిత్ షా

అహ్మదాబాద్, ఆగస్టు 18: పౌరసత్వ చట్ట సవరణ (సీఏఏ)పై కాంగ్రెస్ పార్టీ బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వివర్శించారు. ఈ చట్టం శరణార్థులకు ఆశ్రయం కల్పించేది మాత్రమే కాదని, వారికి న్యాయం చేసేది కూడా అని పేర్కొన్నారు. అహ్మదాబాద్‌లో ఆదివారం ఆయన పలువురు శరణార్థులకు భారత పౌరసత్వ పట్టాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘సీఏఏ ప్రజలకు పౌరసత్వం ఇచ్చేది మాత్రమే కాదు. లక్షల మందికి హక్కులు, న్యాయం అందించేది. కాంగ్రెస్ దాని మిత్రపక్షాల బుజ్జగింపు రాజకీయాల కారణంగా 1947 నుంచి 2014 వరకు భారత శరణు కోరిన ఎంతోమందికి న్యాయం లభించలేదు’ అని విమర్శించారు.