15 March, 2026 | 8:19 PM

Breaking News

విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •   రాష్ట్రంలోనే సుల్తానాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపుతా   •  

ప్రేమతో ఒక్కటై.. నామినేషన్

01-12-2025 12:41 AM
  1. ఎస్సీ యువతిని ప్రేమ వివాహం చేసుకున్న బీసీ యువకుడు
  2. భార్య పేరుతో సర్పంచ్ పదవికి నామినేషన్ 
  3. సంగారెడ్డి మండలం తాళ్లపల్లిలో ఘటన

సంగారెడ్డి, నవంబర్ 30 (విజయక్రాంతి): అధికారం, పదవి కోరుకునే వారు ఏదైనా చేయడానికి సిద్ధపడతారు. అయితే ఇక్కడ ప్రేమతో పాటు రాజకీయంలో పోటీ చేయడానికి అవకాశం రావడంతో ఏకంగా ఎస్సీ మహిళను బీసీ వర్గానికి చెందిన యు వకుడు పెళ్లి చేసుకుని, తన భార్య పేరున సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సంఘటన సంగారెడ్డి మండలం తాళ్లపల్లి గ్రామంలో జరిగింది.

గ్రామ సర్పంచ్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వు అయింది. అయితే బీసీ వర్గానికి చెందిన చంద్రశేఖర్.. అదే గ్రామంలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన శ్రీజ అనే యువతి కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే శ్రీజ పేరు మీద చంద్రశేఖర్ సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేశాడు. ఈ విషయం పెద్దలకు తెలియడంతో వారిరువురు పారిపోయి పెళ్లి చేసుకున్నారు. యువతి కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేశారు.

అయితే వారిద్దరు మేజర్ కావడంతో పెళ్లి చేసుకున్నామని, తమకు రక్షణ కల్పించాలని ఆదివారం పోలీసులను ఆశ్రయించారు. ఈ విషయం తెలుసుకున్న సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కొత్త జంటకు మద్దతు తెలిపారు. అయితే ముందస్తు ప్రణాళిక ప్రకా రంగానే నామినేషన్ దాఖలు చేసి పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా కొందరు శ్రీజ నామినేషన్ ఉపసంహరించుకునేలా ఒత్తిడి తెస్తున్నట్లు బాధితులు తెలిపారు. తమను గెలిపిస్తే గ్రామాభివృద్ధి చేస్తామని కొంతజంట వేడుకుంటున్నారు.