19 June, 2026 | 2:49 AM

యూనివర్సిటీ టీ -షాట్ విద్యా ఒప్పందం

19-06-2026 01:24 AM

నల్లగొండ టౌన్, జూన్ 18: మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం బిజినెస్ మేనేజ్మెం ట్ విభాగం, తెలంగాణ స్కిల్ అండ్ అకాడమిక్ ట్రైనింగ్ టీ -సాట్ ల మధ్య ఆన్లైన్ శిక్షణ, సర్టిఫికెట్ కోర్సుల ప్రారంభానికి గురువారం ఎంజియూలో అవగాహన ఒప్పందం కుదిరింది. ఎంజియు వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, టి షాట్ సీఈఓ బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు.

ఈ ఒప్పందం ద్వారా గ్రామీణ యువతకు ఉపాధి నైపుణ్యాలు పెంచే ఆన్లైన్ కో ర్సులు అందుబాటులోకి వస్తాయని వీసీ తెలిపారు. టూరిజం, లాజిస్టిక్ మేనేజ్మెంట్ వంటి సర్టిఫికెట్ కోర్సులు త్వరలో ప్రారంభిస్తామని వెల్లడించారు.కార్యక్రమంలో టీ_ షాట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాధిక్, రిజిస్ట్రార్ ఆచార్య కొప్పుల అంజిరెడ్డి, పలువురు అధ్యాపకులు పాల్గొన్నారు.