18 July, 2026 | 12:33 AM

ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవ

18-07-2026 12:33 AM

యాదగిరిగుట్ట, జూలై 17 (విజయక్రాంతి): ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం అద్దాల మండపంలో ఆండాళ్ అమ్మ వారికి ఊంజలి సేవోత్సవం పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం ఆలయ అర్చకులు నిర్వహించారు. సాయం త్రం వేళ అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ఊరేగించారు. స్వామివారి నిత్య రాబడి రూ.14,30,770 వచ్చినట్లు తెలిపారు.