17 April, 2026 | 2:36 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

తెలంగాణకు తీరని అన్యాయం

02-02-2026 03:41 PM

హైదరాబాద్: కేంద్ర బడ్జెట్(Union budget of India)పై మంత్రి తుమ్మల నాగేశ్వర రావు(Minister Tummala Nageswara Rao) స్పందించారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని తెలిపారు. తెలంగాణ వ్యవసాయంపై కేంద్రం తీవ్ర నిర్లక్ష్యం చేసిందని పేర్కొన్నారు. ఎన్నిసార్లు కోరినా ఆయిల్ పామ్ పై దిగుమతి సుంకం పెంచలేదని ఆరోపించారు. పసుపు బోర్డుకు నిధులు కేటాయింపు లేదని మండిపడ్డారు. కొబ్బరి బోర్డు ఏర్పాటుపై ఎలాంటి ప్రకటన లేదన్నారు. ఎరువుల ధరలూ పెరిగే అవకాశముందని తెలుస్తోందన్నారు. ఎరువుల ధరలు పెరిగితే రైతులపై మరింత భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.