02-02-2026 03:52:51 PM
కల్వకుర్తి: గంజాయి మత్తులో వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యకు కల్వకుర్తి ఆప్కారి పోలీసులు సోమవారం ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ స్టేషన్‌లో సౌమ్య చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూలదండలు వేసి నివాళులర్పించారు. అనంతరం సీఐ, వెంకట్ రెడ్డి మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం పోలీసులకు కల్పించినట్లే ఆప్కారి పోలీసులకు కూడా వెపన్‌ల వినియోగంపై అవకాశం కల్పించాలి.
మృతురాలు సౌమ్య కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ లాంఛనాలతో సౌమ్య అంత్యక్రియలు నిర్వహించి, ఆమె కుటుంబానికి భరోసా కల్పించడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. సౌమ్య కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు అందరూ ముందుకు రావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆప్కారి శాఖ సిబ్బంది పాల్గొన్నారు.