2 September, 2026 | 7:48 PM

సాయిబాబా గుడి ధర్మకర్త అకాల మరణం

02-09-2026 | 07:09pm

పాల్వంచ, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత పాల్వంచ సాయిబాబా గుడి ధర్మకర్త(Temple Trustee), కేటీపీఎస్ ఫోర్ మెన్ ముత్యాల కోటేశ్వరరావు(Mutyala Koteswara Rao) బుధవారం ఉదయం బ్రెయిన్ స్ట్రోక్ తో మృతి చెందారు. ఆయన మరణ వార్తతో పాత పాల్వంచలో విషాద ఛాయలు అలముకున్నాయి. కేటీపీఎస్ ఉద్యోగులు, పాత పాల్వంచ ప్రజలు ఆయన పార్ధవదేహాన్ని సందర్శించి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులర్పించారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు